సిరిసిల్లలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో వలస కూలీల తరలింపు కోసం వీహెచ్ ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేశారు. 4 బస్సుల్లో వారిని ఒడిశాకు పంపేందుకు యత్నిస్తుండగా... బస్సులకు అనుమతి లేదని పోలీసులు వారిని నిలిపేశారు.
అదే సమయంలో ఘటనాస్థలానికి తెరాస నాయకులు చేరుకోవడంతో... వీహెచ్, తెరాస నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కూలీల తరలింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెరాస నాయకులు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ సైతం కూలీలను స్వస్థలాలకు పంపిస్తోందని వీహెచ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు కూలీలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెరాస నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై వీహెచ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
''నామీద ఊరికే కేసులు పెడుతున్నారు. కరోనా కేసు పెట్టారు. ఏమి నాకేమన్నా కరోనా ఉన్నదా? సాయం చేయడానికి వస్తే ఇదేంటి? నువ్వు ఎంత సేపటికి చెక్కులు తీసుకోవడమే సరిపోతుంది. కరోనా కేసులు ఎక్కువ హైదరాబాద్లో వస్తున్నాయి. నిన్నటి వరకు మర్కత్ వల్ల వచ్చాయని... ఇప్పడేమో వలస కార్మికుల వల్ల వస్తుందని చెపుతున్నారు. ఇన్ని కేసులు రావడానికి మీరే బాధ్యత వహించి రాజీనామా చేయాలి.''
-వి. హనుమంతురావు
ఇవీ చూడండి: 'కొవ్వి'డ్‌పై బ్రిటన్ ప్రధాని పోరు!