రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో కరీంనగర్-సిరిసిల్ల రహదారిపై గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీచూడండి: కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ