రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి తిరుపతి అరగుండుతో నిరసన తెలిపారు. ఎగువ మానేరును ఎండబెట్టి... మెదక్ జిల్లా కొండపోచమ్మకు గోదావరి జలాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీలో ఎగువ మానేరును గోదావరి జలాలతో నింపి సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఇప్పుడు కేవలం మెదక్ జిల్లాలోని రంగనాయక్సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గోదావరి జలాలతో ఎగువ మానేరు ప్రాజెక్టును నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్, గంభీరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎగువమానేరుకు గోదావరి నీళ్లు వదలాలని ఆరగుండుతో నిరసన
ఎగువమానేరుకు గోదావరి నీళ్లు తరలించటం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. కేవలం మెదక్ జిల్లా కొండపోచమ్మకు గోదావరి జలాలను తరలిస్తున్నారని అరగుండుతో నిరసన వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి తిరుపతి అరగుండుతో నిరసన తెలిపారు. ఎగువ మానేరును ఎండబెట్టి... మెదక్ జిల్లా కొండపోచమ్మకు గోదావరి జలాలను తరలిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీలో ఎగువ మానేరును గోదావరి జలాలతో నింపి సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఇప్పుడు కేవలం మెదక్ జిల్లాలోని రంగనాయక్సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గోదావరి జలాలతో ఎగువ మానేరు ప్రాజెక్టును నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్, గంభీరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?