రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూరు సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భంగా తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి భాజపా అభ్యర్థులు కార్యాలయంలోకి సెల్ఫోన్లు తీసుకుపోవడం వల్ల తెరాస నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.
ఇదీ చూడండి.. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్‌లో భారత్కు కాంస్యం