ETV Bharat / entertainment

ఇది కదా 'పుష్ప రాజ్' బ్రాండ్ అంటే- తెలుగులో తొలి సినిమాగా రికార్డ్! - PUSHPA 2 PRE SALES

పుష్ప రూల్ షురూ- మరో రికార్డ్ ఖాతాతోకి

Pushpa 2 Records
Pushpa 2 Records (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 10:16 AM IST

Pushpa 2 Pre Sales : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' రిలీజ్​కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు ఘనతలు సాధించిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డ్ కొట్టింది. డిసెంబర్ 5న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్​లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ప్రీ సేల్ బుకింగ్స్​లో పుష్ప హవా సృష్టిస్తోంది.

ముఖ్యంగా​ అమెరికా ప్రీ బుకింగ్స్​లో భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. మంగళవారం (19/11) నాటికి 'పుష్ప 2' పీ బుకింగ్స్​ వన్‌ మిలియన్ డాలర్ల మార్క్‌ అందుకుంది. ఈ క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్లు వసూల్ చేసిన తొలి సినిమాగా రికార్డు కొట్టింది. ఇక 15 వేలకు పైనే టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా, ఓపెనింగ్ డే భారీ సంఖ్యలో ప్రీమియర్స్ పడనున్నాయి. అమెరికాలో 3230 షోలు వేయనున్నారు.

రికార్డ్ బ్రేక్
కాగా, ఇదే ​ అమెరికాలో 'పుష్ప పార్ట్ 1' లాంగ్​ రన్​లో మొత్తం 4లక్షల డాలర్లు వసూల్ చేసింది. 'పుష్ప ది రూల్' ఈ సంఖ్యను ఎప్పుడో దాటేసింది. రిలీజ్​కు మరో 15 రోజుల సమయం ఉండగానే ఈ రికార్డు సాధించడం విశేషం.

ట్రైలర్​తో అరాచకం
ఆదివారం రిలీజైన ట్రైలర్ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ ఇప్పటికే 120 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఒక్క తెలుగులోనే 47 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక 2.3+ మిలియన్ లైక్స్​తో ఈ ట్రైలర్ ట్రెండింగ్ నెం 1లో కొనసాగుతోంది.

కాగా, డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్​గా నటిస్తుండగా, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాట్ బస్టర్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రవి శంకర్, నవీన్ రూపొందించారు.

మొన్న 'పుష్ప 2'- ఇప్పుడు 'గేమ్​ఛేంజర్'​ - రికార్డ్​ ధరకు హిందీ రైట్స్​!

ఇది 'పుష్ప' రూలింగ్- రిలీజ్​కు ముందే మరో రికార్డ్ బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.