రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేటలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అంబేడ్కర్ రిజర్వేషన్లు అందించారని ఎమ్మెల్యే అన్నారు. నేటి పరిస్థితుల్లో ఎస్సీలు ఉన్నత ఉద్యోగాలు, వివిధ రంగాల్లో రాణించడం అంబేడ్కర్ త్యాగాల ఫలమేనని వెల్లడించారు.
ఇవీ చూడండి: భాజపాలో చేరిన సోమారపు సత్యనారాయణ