ETV Bharat / state

bull kart: బీభత్సం సృష్టించిన ఎడ్లబండి... పరుగులు తీసిన జనాలు - telangana varthalu

భాజపా నేతలు చేపట్టిన ఆందోళనలో ఎడ్ల బండి బీభత్సం సృష్టించింది. జనాలను చూసి భయపడి ఎడ్లు పరుగులు పెట్టడంతో అక్కడికి వచ్చిన ప్రజలతో పాటు పోలీసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.

బీభత్సం సృష్టించిన ఎడ్లబండి... పరుగులు తీసిన జనాలు

author img

By

Published : Dec 1, 2021, 4:00 AM IST

బీభత్సం సృష్టించిన ఎడ్లబండి... పరుగులు తీసిన జనాలు

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భాజపా నేతలు చేపట్టిన ఆందోళనలో ఎడ్ల బండి బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వైవిధ్యంగా ఎడ్ల బండిపై వెళ్లాలని భావించారు. కార్యకర్తలు ఎడ్లబండిపై వస్తున్న తరుణంలో ఎడ్లు బెదిరిపోయాయి. జనాలను చూసి పరుగులు పెట్టడంతో అక్కడికి వచ్చిన ప్రజలతో పాటు పోలీసులు భయాందోళనకు గురయ్యారు. బెదిరిపోయి పరుగులు తీస్తున్న ఎడ్లబండి నుంచి తప్పించుకొనేందుకు ప్రజలు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఎడ్లబండిపై ఉన్న భాజపా పట్టణ అధ్యక్షుడు వేణు కిందపడిపోగా.. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

Ramoji Foundation: రామోజీ ఫౌండేషన్ దాతృత్వం.. నిరుపేద విద్యార్థులకు చేయూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.