ETV Bharat / state

'ప్రధానిపై విమర్శలు చేసేందుకే కేసీఆర్‌ కుటుంబం రాజకీయాలు చేస్తుంది' - KCR latest news

Bandi Sanjay Fires On KCR : సీఎం కేసీఆర్​పై బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చలేదని బండి సంజయ్ ఆక్షేపించారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Dec 22, 2022, 3:51 PM IST

Bandi Sanjay Fires On KCR : తన కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రజలకిచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఒకవేళ ఎన్నికల హామీలను కేసీఆర్‌ నెరవేరిస్తే.. తాను చెప్పు దెబ్బలకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రధానిపై దుమ్మెత్తిపోసేందుకు కేసీఆర్‌ కుటుంబం రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. సిరిసిల్ల జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ యత్నాలు'

సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బండి సంజయ్‌ ప్రచారం చేశారు. సెస్ నష్టాల్లోకి ఎందుకు దిగజారిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెస్ లాభాల్లో నడవాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

"ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత సీఎం కుటుంబంలో వణుకుడు మొదలైంది. ఏ విధంగా అహంకారంగా మాట్లాడుతున్నారో, అసభ్యంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలాగా దేశం అభివృద్ధి చెందాలని అంటున్నారు. ఎక్కడ తెలంగాణ అభివృద్ధి చెందింది. కేవలం తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ఈ నాటకాలు ఆడుతున్నారు." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి: బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు: హరీశ్‌రావు

'వరుస పండుగల వేళ బీఅలర్ట్.. ప్రజలంతా మాస్క్​ తప్పక ధరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.