రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరేళ్ల గిరిజన బాలికపై తెరాస నాయకుడు హత్యాచారయత్నానికి(Bandi sanjay on sircilla incident) పాల్పడ్డాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెరాస నాయకుడు ఆ బాలిక బంగారు భవిష్యత్తును నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో బాధిత చిన్నారి చికిత్స(Bandi sanjay on sircilla incident) పొందుతోంది. ఆస్పత్రికి చేరుకుని బాలిక కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. చిన్నారి ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు(Bandi sanjay on sircilla incident) వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు.. లైసెన్స్డ్ గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. వారు అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా శిక్ష పడకుండా ప్రభుత్వం వారిని కాపాడుకుంటోంది. సంచలన వార్త అయితేనే సీఎం కేసీఆర్ స్పందిస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలిక.. నిరుపేద కుటుంబానికి చెందినది కాబట్టే ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది. స్థానిక మంత్రి కూడా ఘటనపై స్పందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మంత్రీ స్పందించలేదు
అఘాయిత్యానికి పాల్పడిన అధికార పార్టీ నాయకుడికి కొమ్ము కాస్తోందని బండి సంజయ్(Bandi sanjay on sircilla incident) ఆరోపించారు. రాష్ట్రంలో వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువస్తే చికిత్స చేయకుండా సీఎం ఆఫీసు నుంచి ఒత్తిడి వచ్చిందని విమర్శించారు. స్థానికులు, భాజపా నాయకులు ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదని వ్యాఖ్యానించారు. సిరిసిల్లకు చెందిన మంత్రి కూడా ఈ ఘటనపై స్పందించలేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. భాజపా తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: Etela Rajender leads : ఉపపోరులో ఈటల జోరు.. భాజపాకు 3,186 ఓట్ల ఆధిక్యం