రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఎస్సీ సంఘాలు నిరసన తెలిపాయి. పంచాయతీ ఎన్నికలు జరగకుండా మాజీ సర్పంచి హైకోర్టులో స్టే తెస్తున్నారని ఆరోపించారు. సర్పంచి పదవిని ఎన్నికల సంఘం ఎస్సీకి రిజర్వ్ చేసినప్పటికీ కొంతమంది పేర్లు తొలిగించి బీసీకి కేటాయించేలా ప్రయత్నిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో సర్పంచి లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గ్రామాభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేస్తూ ర్యాలీ తీశారు. ఇప్పటికైనా కోర్టులో వేసిన పిటిషన్లు విరమించుకొని ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: పండుగలను న్యాయస్థానాలు నిషేధించలేవు: హైకోర్టు