ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా ప్రణాళికలు రూపొందిస్తామని మిషన్ భగీరథ ఈఈ జానకి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవనంలో తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులకు మిషన్ భగీరథ నీటి వినియోగంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గ్రామాల్లో మిషన్ భగీరథపై ప్రజలకు అవగాహన కల్పించి మిషన్ భగీరథ నీటిని ప్రజలు తాగేలా కృషి చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు కలిగనపుడు తమ దృష్టికి తీసుకురావాలని ఈఈ ప్రజలకు సూచించారు. కొన్ని గ్రామాల్లో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జానకి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, సెస్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, ఈఓపీఆర్డీ రాజు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గోవింద్పూర్లో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్