ETV Bharat / state

కవులను, కళాకారులను ప్రోత్సహించాలి: ఆర్‌. నారాయణ మూర్తి - ఆహా పురస్కార్-2021లో పాల్గొన్న ఆర్‌. నారాయణ మూర్తి

కవులు, కళాకారులను ప్రోత్సహించాలని ఆర్‌. నారాయణ మూర్తి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహా లింగేశ్వర గార్డెన్స్‌లో ఆహా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహాపురస్కార్-2021 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కవులను, కళాకారులను ప్రోత్సహించాలి: ఆర్‌. నారాయణ మూర్తి

author img

By

Published : Feb 6, 2021, 10:46 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహా లింగేశ్వర గార్డెన్స్‌లో ఆహా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహాపురస్కార్-2021 కార్యక్రమం నిర్వహించారు. సినీ నటుడు, దర్శకుడు ఆర్‌. నారాయణ మూర్తి ముఖ్యఅతిథిగా హాజరై... కరోనా కాలంలో సేవ చేసిన కవులకు, కళాకారులకు పురస్కారాలు అందజేశారు. ఆహా ఫౌండేషన్‌ భవిష్యత్‌లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కవులను, కళాకారులను ప్రోత్సాహించాలన్నారు.

రైతులు చేస్తున్న పోరాటానికి కవులు, కళాకారులు మద్దతు తెలపాలని కోరారు. కొనుగోలు కేంద్రాలని కొనసాగించి, మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలున్న రాష్ట్రాలకే బడ్జెట్‌లో కేటాయింపులు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటకకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. భాజపా, కాంగ్రేసేతర పార్టీలతో కలిసి తృతీయ ఫ్రంట్‌ కోసం కేసీఆర్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కుమార్, ప్రజాకవులు జయరాజ్, మిట్టపల్లి సురేందర్, పార్వతరోహకురాలు మాలావత్ పూర్ణ, మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాధవి, వైస్ ఛైర్మన్ మధు రాజేందర్, ఫీర్ మహ్మద్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా రాష్ట్రంలో రహదారుల దిగ్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.