రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆది శ్రీనివాస్‌ను పోలీసులు ఇవాళ ఉదయం గృహనిర్బంధం చేశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై హైదరాబాద్‌లో చేపట్టే నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కివేయడమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ఆరోపించారు.