రాష్ట్రంలో హమాలీ కార్మికులకు ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఐకేపీ సొసైటీలో పనిచేస్తున్న హమాలీలకు క్వింటాలుకు రూ. 50 చొప్పున కూలీ నిర్ణయించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్.. మరో నలుగురికి గ్రీన్ ఛాలెంజ్