ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోన్న వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి వ్యవహారాలు తరచూ బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా లడ్డూ ప్రసాదాల సొమ్ము రూ.45 లక్షలను రికార్డు అసిస్టెంట్ తన సొంతానికి వాడుకున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
ప్రతిరోజు ప్రసాదం పెద్ద ఎత్తున విక్రయం జరిగినప్పటికీ ప్రసాదం కౌంటర్‌లో పని చేసే రికార్డు అసిస్టెంట్ వెంకటేశ్ తక్కువ అమ్మినట్లు లెక్కచూపుతూ.. ఆ సొమ్మును సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇలా జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆలయ సూపరింటెండెంట్ ఒకరు ప్రసాద ఆదాయానికి సంబంధించిన వివరాలు తనిఖీ చేయడంతో ఈ అక్రమం వెలుగు చూసింది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఆ సొమ్ము తిరిగి చెల్లించినట్లు సమాచారం.
ఈ విషయంపై ఆలయ ఈవో స్పందించారు. ప్రసాదాల కౌంటర్‌లో సొమ్ము సొంతానికి వాడుకున్న విషయం నిజమేనని.. అతను తిరిగి డబ్బు చెల్లించాడని వివరించారు.
ఇదీ చూడండి: లాక్డౌన్పై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవం: డా.శ్రీనివాస్