రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. శనివారం ఏకంగా 104 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క వేములవాడ పీహెచ్సీ పరిధిలోనే 59 కొవిడ్ కేసులొచ్చాయి.
ఒకే రోజు 104 కరోనా కేసులు రావటంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోంది: కేటీఆర్