కాళేశ్వరం జలాలతో పాటు ఎగువన కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. జలాశయం నీటి మట్టం పూర్తిస్థాయికి చేరువవుతున్న క్రమంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు గోదావరిలో వరద నీటిని వదిలారు.
వర్షాలకు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు పచ్చదనం పరుచుకున్నాయి. కనుచూపు మేర పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రాజెక్టు గేట్ల నుంచి వచ్చే వరద ప్రవాహంతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల్లో ఆకుపచ్చని అందాలు ఆకట్టుకుంటున్నాయి.