ETV Bharat / state

భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతం - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు

భర్త ఆయురారోగ్యాలతో జీవించాలని, పూర్ణ ఆయుష్కుడు కావాలని కోరుతూ... పెద్దపల్లి జిల్లా మంథనిలో మహిళలు భక్తిశ్రద్ధలతో 'వటసావిత్రి' వ్రతం చేశారు. ఏటా జ్యేష్ఠ మాసంలో వివాహితులైన స్త్రీలు ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందని... పురోహితులు తెలిపారు.

Womens performing Vata savitri vratam
పెద్దపల్లి జిల్లా మంథని వటసావిత్రి వ్రతాన్ని ఆచరించిన మహిళలు
author img

By

Published : Jun 24, 2021, 2:05 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో సౌభాగ్యం కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతం ఆచరించారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కలకాలం సిరి సంపదలు, పాడి పంటలు వృద్ధి చెందుతాయని మహిళలు భావిస్తున్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో వివాహితులైన స్త్రీలు ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందని... పురోహితులు తెలిపారు.

Womens performing Vata savitri vratam
పెద్దపల్లి జిల్లా మంథని వటసావిత్రి వ్రతాన్ని ఆచరించిన మహిళలు

పురాణాల ప్రకారం...

పూర్వం సతీ సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతున్ని మృత్యువు నుంచి కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ సమయంలో నారద మహర్షి ఉపదేశానుసారం వ్రతం ఆచరించి... భర్తను మృత్యువు నుంచి రక్షించుకుంటుంది. ఆ వ్రతమే వటసావిత్రి వ్రతమని పురాణాల్లో భక్తుల నమ్మకం. ఆ రోజునే... తెలుగింటి ఆడపడుచు ఏటా... తన భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారని పురోహితులు తెలిపారు.

వృక్షానికి పూజలు...

ఎంతో ప్రత్యేకత కలిగిన వట సావిత్రి వ్రతాన్ని... ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజున మహిళలు వారి ఆచారం ప్రకారం ఆచరిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో రావిచెట్టుకు, మరికొన్ని ప్రాంతాల్లో మర్రిచెట్టు దగ్గర మహిళలు కూర్చొని... ఆ వృక్షాన్ని అశ్వత్థ నారాయణునిగా భావించి... లక్ష్మీదేవి సహితంగా పూజలు నిర్వహిస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో శివపార్వతులుగా భావించి మొక్కుతున్నారు. చెట్టుకు ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని చుట్టి గౌరమ్మ పూజలు నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: High Court: ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.