పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి నదిలోని తెల్లటి నురగతో కూడిన నీరు దశల వారిగా ప్రత్యక్షమవుతోంది. అసలు నీరు ఎందుకు అలా మారుతుందో, ఎక్కడి నుంచి వస్తుందో? ఏవైనా వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో మొదటిసారి నురగు వచ్చినప్పుడు స్థానికులు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు నమూనాలు సేకరించి విచారణ చేస్తామని చెప్పి ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు.
నిలకడగా ఉన్న నీటిలో నురగ రావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం, పాలకులు స్పందించి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. గోదావరి నది కొల్బెల్ట్ వంతెన వద్ద తెల్లటి నురగను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారు. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గోదావరినదిలో పారుతున్న తెల్లని నురగ నీటిని తీసుకొని వెళ్లడం గమనార్హం.
ఇవీచూడండి: వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం