వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీటితో కళకళలాడుతోంది. దీనిద్వారా గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంపుహౌస్‌లో 8 మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.
8 రోజుల క్రితం రెండు మోటార్ల ద్వారా ప్రారంభమైన నీటి ఎత్తిపోత.. నీటి ప్రవాహం పెరగడం వల్ల క్రమంగా ఎనిమిది మోటార్లకు చేరుకుంది. 8 మోటార్లు రన్ చేస్తూ.. 16 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యారేజ్ జలకళతో నిండుకుండలా మారింది.
పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు, ప్రస్తుతం 6.77 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉంది. బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 130.00 మీటర్లు, ప్రస్తుతం 128.66 మీటర్ల మేర నీరు ఉంది. సరస్వతి పంపుహౌస్ నుంచి 8 మోటార్ల ద్వారా 23,440 వేల క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజ్ లోకి ఎత్తిపోస్తున్నారు.
- ఇదీ చదవండి : Corona: మెదడుపైనా మహమ్మారి ప్రభావం