పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. అంతర్గాం మండలం గోలివాడలోని పార్వతి పంప్‌హౌజ్ 5వ పంపు ద్వారా 2,200 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయానికి పంపిస్తున్నారు. ఈ నెల 11న ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. అనంతరం 12 నుంచి ఎల్లంపల్లిలోని నీటిని మధ్యమానేరు జలాశయానికి నిరంతరంగా ఎత్తిపోస్తున్నారు.
ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం తగ్గిపోవటం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతీ పంప్‌హజ్ నుంచి 5వ మోటరు పంపును ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ రోజు నుంచి మరిన్ని పంపు మోటర్లు ప్రారంభించి ఎక్కువ మొత్తంలో నీటిని ఎత్తిపోయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పార్వతి పంప్‌హౌజ్‌లో 9 మోటర్లకు గాను 8 పంపు మోటర్లను సిద్ధం చేయగా అన్నింటి ద్వారా ఎత్తిపోతలు చేపట్టారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు