పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అన్నారం పంప్ హౌస్ నుంచి సుందిళ్ల పార్వతి జలాశయానికి నీటిని ఎత్తిపోస్తున్నారు. అన్నారం పంప్ హౌస్ లోకి 2900 క్యూసెక్కుల నీరు వస్తోంది. సుందిల్ల పార్వతి జలాశయంలో ప్రస్తుతం 8.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడం వల్ల అన్నారం పంప్‌హౌస్ నుంచి సుందిళ్ల పార్వతి బ్యారేజీలోకి నీటిని ఎత్తి పోస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఫోటో అంటే భవిష్యత్ తరాలకు గుర్తుండిపోవాలి'