ETV Bharat / state

ప్రజాభిప్రాయంతోనే పైప్​లైన్​ నిర్మాణం: రామగుండం ఎమ్మెల్యే

రామగుండంలో కొత్తగా నిర్మిస్తున్న పవర్‌ ప్రాజెక్టు యాష్‌ తరలింపు కోసం పైప్‌లైన్‌ నిర్మాణంలో ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనమే తమకు శిరోధార్యమన్నారు. కార్పొరేషన్‌లో నిర్వహించిన గ్రామ సభను ఎమ్మెల్యే బహిష్కరించారు. ఎన్టీపీసీ యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజల అభిప్రాయంతోనే పైప్​లైన్​ నిర్మాణం: రామగుండం ఎమ్మెల్యే

author img

By

Published : Jun 27, 2020, 1:08 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలంగాణ పవర్ ప్రాజెక్టు యాష్ తరలింపు కోసం నూతనంగా నిర్మించనున్న పైప్‌లైన్ నిర్మాణంలో ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. వారికి ఇబ్బందులు కలిగే ఏ కార్యక్రమాన్ని తాము నిర్వహించబోమన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీపీసీ యాష్ పాండ్ భూసేకరణపై మల్కాపూర్ గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహించారు.

దేశానికి, రాష్ట్రాలకు వెలుగులు అందించేందుకు గతంలో ఎన్టీపీసీ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మాల్కాపూర్ గ్రామ ప్రజలు తమ భూములు త్యాగం చేశారన్నారని ఎమ్మెల్యే అన్నారు. భూ నిర్వాసిత గ్రామాల అభివృద్ధిపై ఎన్టీపీసీ యాజమాన్యం దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు కావాల్సిన మౌళిక వసతులు అందించడంలో ఎన్టీపీసీ యాజమాన్యం విఫలమైందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్య తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. గ్రామ సభను బహిష్కరించారు. ప్రజల ప్రయోజనాల మేరకే తమపాలన సాగుతుందని కోరుకంటి చందర్‌ తెలిపారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.