పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మంథని పట్టణం, మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం సంభవించింది. బలమైన గాలులకు అనేక చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంబాలు నేలకూలాయి. కొన్ని చోట్ల ఇంటి గోడలు కూలిపోయి, రేకులు ఎగిరిపోయాయి. అందులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.
మంథని పట్టణంలో విద్యుత్తు నియంత్రిక నేలకూలి.. పలు చోట్ల విద్యుత్తు తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. గ్రామాల మధ్యలో చెట్లు పడడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇదీ చూడండి: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఈటల