అంగన్వాడీ టీచర్ భర్తీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని కమాన్‌పూర్ మండలం పేరపల్లి గ్రామ నిరుద్యోగులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా అధికారులకి విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు.
పంచాయతీ ఏర్పడటంతో..
కమాన్‌పూర్ మండలంలో అంగన్వాడీ టీచర్ భర్తీ వివాదంగా మారింది. ఉమ్మడి పేరపల్లి గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉండేవి. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. దీంతో ఒక అంగన్వాడీ సెంటర్ గొల్లపల్లికి మరొకటి పేరపల్లికి కేటాయించారు.
మృతిచెందగా..
పేరపల్లి అంగన్వాడీ సెంటర్లో పనిచేసే టీచర్ అనారోగ్యంతో మృతిచెందగా అక్కడి టీచర్ పోస్ట్‌కు ఖాళీ ఏర్పడింది. గొల్లపల్లిలో విధులు నిర్వహిస్తున్న టీచర్ ఇక్కడికి బదిలీ జరిగింది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్‌ను తమ గ్రామనిరుద్యోగుల ద్వారానే భర్తీ చెయ్యాలని.. అమె ఇక్కడికి వస్తే ఒక ఉద్యోగం కోల్పోతామని గ్రామస్థులు పలుమార్లు సీడీపీఓ మంథని గారికి విన్నవించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకే ..
ఐసీడీఎస్ సూపర్వైజర్ని తీసుకోని సదరు మహిళా అంగన్వాడీ సెంటర్‌కి రావటంతో గ్రామస్థుల అడ్డుకున్నారు. మరునాడు సూపర్వైజర్ బదిలీపై వచ్చిన టీచర్ని తీసుకొని స్థానిక తహసీల్దార్ ఉమా శంకర్ సహాయంతో అంగన్వాడీ కేంద్రానికి వచ్చారు. మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంగన్వాడీ సెంటర్ బాధ్యతలు బదిలీ టీచర్‌కు అప్పగించిన తహసీల్దార్ కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:రిఫండ్ గడువును పొడిగించిన రైల్వే శాఖ