పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్సులు బయటకుపోకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం