నూతన రెవెన్యూ చట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కర్షకుల కళ్లలో సంతోషాన్ని తెచ్చారని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి నియోజకవర్గంలో తెరాస నేతలు సంబురాలు నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో.. 2వేల ట్రాక్టర్లతో రైతులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ట్రాక్టర్ల ర్యాలీని సుల్తానాబాద్‌లో ఎంపీ వెంకటేశ్ జెండా ఊపి ప్రారంభించారు. రాజీవ్ రహదారి మీదుగా.. పెద్దపల్లి వరకు ర్యాలీ కొనసాగింది. దారిపొడవునా.. తెరాస సర్కార్‌కు అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.
తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెరాస సర్కార్‌కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు.
- ఇదీ చూడండి : నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక