ముఖ్యమంత్రి కేసీఆర్... నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం హర్షణీయమని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూతగాదాలు తలెత్తకుండా, లంచాలకు తావులేకుండా నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని తెరాస నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ తో పాటు కార్పొరేటర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.