ETV Bharat / state

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌ - రామగుండం ఎరువుల పరిశ్రమ వార్తలు

ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న రామగుండం ఎరువుల పరిశ్రమలో యూరియా ఉత్పత్తి గ్రేడ్-1 ట్రయల్ రన్ ప్రారంభమైంది. రెండు దశాబ్దాల క్రితం మూతపడిన పరిశ్రమలో రాత్రి రెండున్నర గంటలకు అధికారులు ట్రయల్‌రన్ ప్రారంభించారు‌. మొత్తం రూ.6వేల 180కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రాజెక్టును చేపట్టగా... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి జరగనుంది. మరో నెలలో పూర్తిస్థాయిలో యూరియా ఉత్పత్తి కానుంది.

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌
రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌
author img

By

Published : Feb 28, 2021, 6:50 AM IST

Updated : Feb 28, 2021, 8:25 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో యూరియా ఉత్పత్తి గ్రేడ్ -1 ట్రయల్ రన్ ప్రారంభమైంది. రాత్రి రెండున్నర గంటల సమయంలో ప్రారంభమైన ట్రయల్ రన్‌కు సీఈఓ నిర్లప్ సింగ్ రాయ్ హాజరయ్యారు. మొత్తం రూ. 6180 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు పునరుద్ధరణను చేపట్టాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 'వేపనూనె పూత‌' రాసిన యూరియాను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు.

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

దేశవ్యాప్తంగా 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగిస్తుండగా 250 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే భారత్‌లో ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 100 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను విదేశాల నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. ప్లాంట్ పూర్తి స్థాయి పని తీరును ఈ ట్రయల్‌లో అంచనా వేస్తామని సీఈవో వెల్లడించారు. వాణిజ్య ఉత్పత్తిని మార్చిలో ప్రారంభించనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: దిక్కుతోచని స్థితిలో మక్కల రైతులు... దిగజారుతున్న ధరలు

Last Updated : Feb 28, 2021, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.