పెద్దపల్లి జిల్లా మంథనిలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కుటంబసమేతంగా పిల్లాపాపలతో మంథని చేరుకుని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసి... గౌతమేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి వార్లకు పూజలు నిర్వహించారు. దేవాలయ పరిసర ప్రాంగణాలను శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.
భక్తి పారవశ్యంలో పొంచి ఉన్న ఉపద్రవాన్ని మరిచి స్నానాలు ఆచరించడం పట్ల డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గుంపులుగా స్నానాలు చేయడం వల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. భక్తితో ఆలయానికి వెళ్లొచ్చు కానీ... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!