police arrested the thief in Ramagundam: మాములు వ్యక్తిలాగే వీధులలో తిరుగుతుంటాడు. ముందురోజు రెక్కి నిర్వహించి పగటివేళలో చోరీలకు పాల్పడుతుంటాడు. బతుకుదెరువుకై రామగుండంకు వచ్చిన వ్యక్తి జల్సాలకు అలవాటు పడి గజదొంగలా మారాడు. కోట్ల రూపాయల సొత్తును కాజేశాడు. వింతేమిటంటే దొంగతనం కేసులు నమోదయ్యాయి కానీ పోలీసులకు చిక్కలేదు. చివరగా సీసీనస్పూర్ పోలీసులు రోజువారి విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా పట్టుకుని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి నుంచి కారు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన రాజవరపు వెంకటేశ్వర్లు(28) బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు వచ్చాడు. ఇక్కడి స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి, ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇదే క్రమంలో పగటి సమయాల్లో వివిధ ప్రాంతాలను గమనిస్తాడు... మరుసటి రోజు పక్కాగా ప్లాన్‌ను అమలు చేస్తాడు.
ఇలా గత మూడేళ్ల నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తంగా ఇతడిపై 72 కేసులు వివిధ పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. ఈ దొంగతనాలలో 2.89 కిలోల బంగారం, 4.07 కిలోల వెండి, 19 లక్షల రూపాయాల నగదు చోరీ చేశాడు. వీటి విలువ సుమారు కోటి 20 లక్షల ఉంటుంది. చోరీ చేసిన సొమ్ములో 90 శాతం ఆన్లైన్ బెట్టింగ్‌కు ఖర్చు చేసి మిగతా 10శాతం డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సీపీ అభినందించి, నగదు రివార్డును అందించారు.
"నెల్లూరు జిల్లాకు చెందిన రాజవరపు వెంకటేశ్వర్లు(28) బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు వచ్చాడు. ఇలా గత మూడేళ్ల నుంచి రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తంగా ఇతడిపై 72 కేసులు వివిధ ప్రాంతాల పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. ఈ దొంగతనాలలో 2.89 కిలోల బంగారం, 4.07 కిలోల వెండి, 19 లక్షల రూపాయాల నగదు చోరీ చేశాడు. వీటి విలువ సుమారు కోటి 20 లక్షల ఉంటుంది. చోరీ చేసిన సొమ్ములో 90 శాతం ఆన్లైన్ బెట్టింగ్‌కు ఖర్చు చేసి మిగతా 10శాతం డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు." -రెమా రాజేశ్వరి, పోలీస్ కమిషనర్, రామగుండం
ఇవీ చదవండి: