ETV Bharat / state

బాలల సైన్స్​ కాంగ్రెస్​ పోటీల్లో సత్తాచాటిన పెద్దపల్లి విద్యార్థిని

ప్రతిభకు వయసుతో సంబంధం లేదు... ఓ సమస్య ఒక అద్భుతమైన ఆవిష్కరణకు బాటలు వేస్తుంది అనడానికి ఈ విద్యార్థిని ఆలోచనే ఊదాహరణ. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆరోతరగతి చదువుతున్న బాలిక బెంగళూరులో జరుగుతున్న 107వ బాలల సైన్స్​ కాంగ్రెస్​లో తన ప్రదర్శనతో సత్తాచాటింది. అది ఎలా అంటారా..

workerskeepdustaway
బాలల సైన్స్​ కాంగ్రెస్​ పోటీల్లో సత్తాచాటిన పెద్దపల్లి విద్యార్థిని
author img

By

Published : Jan 6, 2020, 10:48 PM IST

బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ సైన్స్​కాంగ్రెస్​ పోటీల్లో రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన బాలిక సత్తాచాటింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న హర్షిత తన ప్రదర్శనతో ఆలోచింపచేయడమే కాదు.. ఓ సమస్యకు పరిష్కారం చూపింది. శిరస్త్రాణానికి ఫ్యాన్లు బిగించి..వాటికి సెన్సార్​ ఏర్పాటుతో ఓ వినూత్న ఆలోచనకు జీవం పోసింది.

ఆలోచన ఎలా వచ్చిందంటే...

వెల్డింగ్​ పనిచేసే హర్షిత అంకుల్​ పొగప్రభావంతో అనారోగ్యం పాలయ్యాడు. అతనికి వచ్చిన ఊపిరితిత్తుల సమస్య మరెవరికీ రాకుండా చేయాలనే ఆలోచన "కామన్​మేన్​ ఫ్రెండ్లీ మల్టీపుల్​ హెల్మెట్​" ప్రాజెక్టుకు జీవం పోసింది. ఈ పరికరం వల్ల వడ్రంగి, వెల్డింగ్​ పనిచేసే వారికే కాదు... ముఖానికి ఎలాంటి రక్షణ లేకుండా పొలాల్లో వ్యవసాయం పనులు చేసుకునే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది.

ఎలా పనిచేస్తుందంటే

సాధారణ శిరస్త్రాణానికే ఫ్యాన్లు బిగించి ఉంటాయి. వాటికి ఏర్పాట్లు చేసిన సెన్సార్లు సమీపంలోకి పొగ, ధూళి, రాగానే ఫ్యాన్లు తిరగడం ప్రారంభిస్తాయి. దీనివల్ల ముక్కు దగ్గరకు ఎలాంటి పొగ, ధూళి రాకుండా ఉంటుంది.

జిల్లాలోనే తొలి విద్యార్థిని

నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటి సారిగా సైన్స్​ కాంగ్రెస్​ పోటీలకు ఎంపికైన బాలిక హర్షిని మాత్రమే.. తన ప్రతిభతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సాధించాలనే సంకల్పం ఉండాలే గాని... సాకారం కానిది ఏదీ లేదంటూ నిరూపించింది ఈ బాలిక. భవిష్యత్తులో శాస్త్రవేత్తకావాలనుకుంటున్న విద్యార్థి కల నెరవేరాలని కోరుకుందాం.

బాలల సైన్స్​ కాంగ్రెస్​ పోటీల్లో సత్తాచాటిన పెద్దపల్లి విద్యార్థిని
ఇదీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'

Intro:byte: Harshita, Telangana State student

Body:6th Grade girl invents helmet for workers to keep fumes and dust away: Inspired by her uncles problems

Bengaluru: 6th standard girl from Telangana state, Phedapalli district Harshita has invented a helmet with fans attached to it . These fans will keep away fumes and dust . While speaking about her inspiration to invent this she says her uncle got lung disease due to welding.

The stall was put out by Harshita and her mentor in 107th science Congress , Children Science Congress.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.