ETV Bharat / state

జోరుగా తెలంగాణ సోనా వరి సాగు.. దిగుబడులపై రైతుల ఆశలు

లాభసాటి పంటలు పండించి రాష్ట్రాన్ని ఆదర్శ రైతు రాజ్యంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వానాకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఇందులో భాగంగా రైతులు సన్నరకం వరి ధాన్యాన్ని ఎక్కువగా పండించాలని సూచించింది. వ్యవసాయ శాఖ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించి లబ్ది పొందాలని రైతులకు సూచించడంతో "తెలంగాణ సోనా" వరి రకం సాగుకు రైతులు ఉపక్రమించారు. గతంలో బీపీటీ రకాల సాగులో పెట్టుబడులు పెరిగి దిగుబడులు తక్కువగా రావడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డామని రైతులు తెలిపారు. ఈ ఏడు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను అందించే తెలంగాణ సోనా సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Sona Rice cultivation in  Peddapalli District
జోరుగా తెలంగాణ సోనా వరి సాగు.. దిగుబడులపై రైతుల ఆశలు
author img

By

Published : Oct 12, 2020, 4:23 PM IST

పెద్దపల్లి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా నియంత్రిత సాగులో భాగంగా ఈ వానాకాలం సీజన్‌లో 80 శాతం మంది రైతులు వరి, పత్తి పంటల వైపు దృష్టి సారించారు. వాతావరణం అనుకూలించడం.... వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో....జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పంటల సాగు జరిగింది. జిల్లాలో 60 శాతం సన్న రకాలు, 40 శాతం దొడ్డు వరి రకాలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచించారు. తదనుగుణంగానే రైతులు 65శాతం సన్నాలు, 35 శాతం దొడ్డు రకాలు సాగు చేశారు. సన్నాల్లోనూ రైతులు తెలంగాణ సోనా రకాన్నే ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు. తక్కువ కాలపరిమితి కావడం, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రైతలు సోనా సాగుకే ఆసక్తి చూపారు.

జిల్లాలోని మంథని మండలంలో చాలా మంది రైతులు తెలంగాణ సోనా సాగుకే మొగ్గుచూపారు. గతంలో బీపీటీ రకాలను సాగు చేయడం వల్ల పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గాయని..ఈ ఏడు అధికారుల సూచనలతో తెలంగాణ సోనా సాగు చేశామని చెబుతున్న రైతులు పంట అనుకూలంగా ఉందంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు సలహాలను తీసుకుంటూ రైతులు జాగ్రత్తగా పంటను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో చేతికొచ్చే పంట కావడంతో...దిగుబడులపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.

అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక వర్షాల ప్రభావంతో వరి పైరుకు చీడపీడలు ఆశిస్తున్నాయి. పురుగుమందులు ఎన్ని కొట్టినా ఫలితం లేదని...ఎక్కువ మొత్తంలో పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

నియంత్రిత సాగులో భాగంగా తెలంగాణ సోనాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దోమ ఉధృతి అనేది బీపీటీతో పోల్చితే సోనాలో తక్కువ అని ఎరువులు, పురుగుమందుల వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. పంట కూడా 120 రోజుల్లో చేతికి అందుతుందని తెలిపారు. రైతులు నాట్లు వేసేప్పుడు దగ్గర దగ్గరగా వేసుకోవాలని,తద్వారా మొక్కల సంఖ్య పెరిగి దిగుబడులు పెరుగుతాయని సూచిస్తున్నారు. భారీ వర్షాలతో అక్కడక్కడ చీడపీడల కారణంగా పంట నష్టం జరిగిన ఉదంతాలు తప్ప వరి పైరు మెరుగ్గా ఉందని రైతలు అంటున్నారు.. ఇదే ఉత్సాహాన్ని యాసంగిలోనూ కొనసాగిస్తామని చెబుతున్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌లో అందుబాటులోకి మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాళ్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.