విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూలో ఆవిష్కృతం-2020 టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు వారు రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు.
40 మంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన విద్యార్థులు సహజ వనరులు, వాటి ఆవశ్యకత తెలిపే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసిన విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
మైనింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు రూపొందించిన ఓపెన్ కాస్ట్ మైనింగ్ అందర్నీ ఆకట్టుకుంది. తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ ఫెస్ట్ ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు తెలిపారు.
- ఇదీ చూడండి : 'మాతో చెస్ ఆడితే అబ్బాయిలు ఓడిపోవడానికి కారణమదే'