సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత ఎమ్మెల్సీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (Tbgks) గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకే దక్కిందని సంఘం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కార్మిక సంఘం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్మిక సంఘానికి.. ఈటల రాజేందర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
గౌరవ అధ్యక్షురాలిపై ఇష్టానుసారంగా వాఖ్యలు చేయడం సరికాదంటూ రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థలో.. మహిళా ఉద్యోగుల నియామకం, ఏరియా ఆస్పత్రిలో సదుపాయాలు, కార్మిక కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధి కోసం… కవిత అహర్నిశలు కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఆస్తుల పరిరక్షణకే.. ఈటల భాజపాతో జత కట్టారని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి: chada venkat reddy: సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ