భారతదేశానికి బలం యువతేనని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద మార్గంలో యువత ముందుకు నడవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి యువకుడు మోయాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని తన నివాసంలో శ్రీధర్బాబు.... స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడానికి కేసీఆర్ సర్కార్ రవాణా ఛార్జీలు పెంచిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. గతేడాది మంథని నుంచి మేడారానికి ఆర్టీసీ 205 రూపాయలు వసూలు చేసింది, ఈ ఏడాది టికెట్ ధర 260 రూపాయలు నిర్ణయించిందని తెలిపారు.
సమ్మక్క జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తులు వస్తారని, ఈ సమయంలో మేడారం జాతరకు వెళ్లే బస్సు టికెట్ ధర పెంచి, సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు.
- ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఖమ్మం గుమ్మంలో సమస్యల విలయతాండవం