పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అవగాహన కల్పిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆలోచింపజేశాయి. మొదట రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక కార్యాలయం నుంచి కళాశాలల, పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ జరిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనరేట్ అడిషనల్ డీసీపీ రవికుమార్, పెద్దపల్లి డీసీపీ రవీందర్‌లు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని డీసీపీలు సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగి హెల్మెట్ ధరించాలని సూచించారు. దేశంలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల వల్లే మరణిస్తున్నారని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం