ETV Bharat / state

ఎన్టీపీసీలో సాంకేతికలోపం... విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం - Stopped power generation in ntpc

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపంతో 7వ యూనిట్‌లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 7వ యూనిట్​లోని టర్బైన్​ ప్రాంతంలో వాయు పీడనం తగ్గిపోయి ఉత్పత్తి క్రమేపీ తగ్గుముఖం పట్టింది.

stopped-power-generation-in-ntpc-at-ramagundam-peddapally-district
ఎన్టీపీసీలో సాంకేతికలోపంతో నిలిచిపోయిన విద్యుత్తు ఉత్పత్తి
author img

By

Published : Mar 12, 2020, 10:56 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమలో సాంకేతిక లోపంతో 7వ యూనిట్​లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 7వ యూనిట్​లోని టర్బైన్​ ప్రాంతంలో వాయు పీడనం తగ్గిపోయి ఉత్పత్తి క్రమేపీ తగ్గుముఖం పట్టింది. టర్బైన్​ ప్రాంతంలో మరమ్మతులు చేపట్టాలని ప్రణాళికలు వేశారు.

దాదాపు 15రోజుల పాటు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మిగతా 6 యూనిట్లలో మొత్తం 1800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. వార్షిక లక్ష్యం సమీపిస్తున్న తరుణంలో 7వ యూనిట్​లో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కాగా 6 యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తికి అధికారులు నిమగ్నమయ్యారు.

ఎన్టీపీసీలో సాంకేతికలోపంతో నిలిచిపోయిన విద్యుత్తు ఉత్పత్తి

ఇదీ చూడండి: తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.