ETV Bharat / state

రోడ్లపై ఎస్సార్​ఎస్పీ కాలువ.. ఆందోళనలో రైతులు - ఎస్సార్​ఎస్పీ కాలువ నీరు వార్తలు

ఎక్కడైనా ఎస్సార్​ఎస్పీ కాలువ నీరు పంటపొలాలకు పారుతుంది. కాలువ ద్వారా చెరువులు కుంటలు నింపుతారు. కానీ ఈ జిల్లాలో మాత్రం కాలువ నీరు ఇళ్లలోకి చేరడం, రహదారులపై పారుతుంది. పెద్దపల్లి జిల్లా పుట్నూరులో ఎస్సార్​ఎస్పీ కాలువ నీరు పంట పొలాల్లోకి కాకుండా ఇళ్ల రహదారులపై పారుతోంది. దీంతో సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

రోడ్లపై ఎస్సార్​ఎస్పీ కాలువ.. ఆందోళనలో రైతులు

author img

By

Published : Sep 9, 2020, 6:47 AM IST

రోడ్లపై ఎస్సార్​ఎస్పీ కాలువ.. ఆందోళనలో రైతులు

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం గుడిపల్లి నుంచి గుంటూరు గ్రామం వరకు ఎస్సారెస్పీ చిన్న కాలువ ఉంది ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి ప్రాంతం కావడం వల్ల గతంలో కాలువ నీరు గ్రామం వరకు వచ్చేది కాదు. నీటి కోసం గ్రామస్థులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కొందరు గ్రామ శివారులో కొంతమేర కాలువను ఆక్రమించి దానిని మట్టితో పూడ్చారు. అయితే ప్రస్తుతం నీటిని ఎక్కువగా విడుదల చేయడం వల్ల ఆ నీరంతా గ్రామ శివారు కాలువ వరకు వచ్చి చేరుతోంది.

కాలువ ఆక్రమణతో నీరు ముందుకు పోయేందుకు వీలులేక సమీప ఎనిమిదో వార్డులోని గృహాలను ముంచెత్తుతోంది. ఇళ్ల చుట్టూ చేరిన నీరు సిమెంటు రహదారులపై కూడా పారుతోంది. వారం రోజులుగా నీరు వచ్చి చేరుతుండటం వల్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, వెళ్తే తిరిగి రాలేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు అంటున్నారు. విష పురుగులు, సర్పాలు వస్తున్నాయని.. రాత్రిపూట మరింత ఇబ్బందిగా ఉందని భయపడుతున్నారు. నీరు నిలిచిన ఉండటం వల్ల ఇంటి గోడలు తడిచి కూలే అవకాశం ఉందని కంగారు పడుతున్నారు. మరోవైపు దిగువన పంట పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పునరుద్ధరించి పంట పొలాలకు నీరు అందేలా చూడాలని నీటిపారుదల శాఖ అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.