ETV Bharat / state

రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​ - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్​ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని రామగుండం మున్సిపల్​ కమిషన్​ ఉదయ్​ కుమార్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్​ స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Telangana news
పెద్దపల్లి జిల్లా వార్తలు
author img

By

Published : Jun 8, 2021, 2:10 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో వ్యాక్సిన్​ స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నట్లు రామగుండం మున్సిపల్​ కమిషనర్​ ఉదయ్​కుమార్​ తెలిపారు. మరో ఏడు రోజుల పాటు వ్యాక్సినేషన్​ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. కొవిడ్​ థర్డ్​వేవ్​ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ వేయించుకోవాలని సూచించారు.

మొదట్లో అంతంతమాత్రంగా ఉన్నా.. ప్రస్తుతం వ్యాక్సిన్​పై ప్రజల్లో అవగాహన పెరిగిందనన్నారు. రోజు రోజుకి టీకా వేసుకునే వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. అందరికీ సరిపడా వ్యాక్సిన్​ అందుబాటులో ఉందన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వారికి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: Etela : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.