మంథని పురపాలక సిబ్బంది పట్టణంలో ఇంటింటికి వెళ్లి తీసుకు వచ్చిన చెత్తాచెదారం, వ్యాపార సముదాయాల నుంచి వ్యర్ధపదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, హోటల్లో మిగిలిన ఆహార పదార్థాలను తీసుకువచ్చి మంథని-కాటారం ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కన ఉన్న ఇళ్లలోకి చెత్త కొట్టుకువస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
పొగతో ప్రమాదం
డంపింగ్యార్డ్లో మంట పెట్టడం వల్ల వెలువడే పొగ ద్వారా అటువైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోయారు. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా డంపింగ్ యార్డులో వ్యర్థాలను కాలుస్తుండటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని పరిసరాల్లోని ప్రజలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
ఇదీ చూడండి : జన చైతన్యం... కబ్జాపై ఉక్కుపాదం