Sister Ties Rakhi To Brother Who Died Due To Heart Attack In Peddapally : అమ్మలో ఉండే సగం అక్షరం అన్నయ్యనే.. నాన్నలో ఉండే రెండో సగం అన్నయ్యనే. అందుకే తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్ననే వస్తాడు. తన చెల్లెకి చిన్న అపాయం వచ్చిన తట్టుకోలేడు. అలాగే తన అన్నయ్యకు కూడా ఎలాంటి చెడు జరిగిన చెల్లెలు విషాదంలో మునిగిపోతుంది. అన్నకు ఎలాంటి ఆపదలు ఎదురుకాకూడదని.. తనకు రక్షణ చేకూరాలని ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమి(Rakhi Pournami) రోజు.. రాఖీ కడుతూ ఉంటారు. కానీ అలాంటి అన్నయ్యకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలికి జీవితాంతం కన్నీటి విషాదాన్ని మిగిల్చే సన్నివేశం ఎదురైంది. అప్పటివరకు సంతోషంగా గడిపిన అన్న గుండెపోటు(Heart Attack)తో అకస్మాత్తుగా మరణిస్తే.. చెల్లెలు ఆ మృతదేహానికి కడసారిగా రాఖీ కట్టిన విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య.. అప్పటిదాకా సంతోషంగానే ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కనకయ్యకు సోదరి గౌరమ్మ గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టడానికి వచ్చింది. చెల్లెలు ఇంటికి వచ్చిన ఆనందంలో కనకయ్య.. సోదరితో కలిసి ఎంతో ఆనందంగా నడిపాడు. అప్పటివరకు ఇంటిలో అందరితో నవ్వుతూ మాట్లాడిన అతను.. చెల్లెలితో ముచ్చట్లు పెట్టాడు.
Young Man Died of Heart Attack : జిమ్‌కు వెళ్లొచ్చాక గుండెపోటు.. యువకుడి హఠాన్మరణం
Sister Ties Rakhi On Died Brother Wrist on Raksha Bandhan 2023 : ఇంతలోనే ఉన్నట్టుండి.. ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అన్న హఠాత్తుగా విగతజీవిగా మారడం చూసి కుటుంబసభ్యులు, చెల్లెలు గౌరమ్మ షాక్‌లోకి వెళ్లిపోయారు. నేలపై జీవశ్చవంలా పడి ఉన్న తన అన్నను చూస్తూ.. చెల్లెలు గౌరమ్మ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. తన సోదరి దుఃఖాన్ని చూసి అక్కడ వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. అన్న క్షేమంగా ఉండాలని రాఖీ కట్టడానికి వస్తే.. తనకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని గుండెలు పగిలేలా రోదించింది.
13 ఏళ్లకే ఆగిన చిన్నారి గుండె.. చిన్నీ కళ్లు తెరువంటూ సీపీఆర్ చేసిన తండ్రి.. అయినా...
Raksha Bandhan 2023 : తన రోదనను ఓదార్చడం అక్కడి ఉన్నవారి తరం కాలేదు. కడసారిగా తన అన్నయ్య కనకయ్యను చూస్తూ.. తన వెంట తెచ్చుకున్న రాఖీని చివరిసారిగా కనకయ్య మృతదేహానికి కట్టి సాగనంపింది. చెల్లెలు అనురాగాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. దేవుడు ఎందుకు అన్నాచెల్లిని విడదీశాడని అక్కడ ఉన్నవారంతా వాపోయారు. ఈ ఘటనతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.