ETV Bharat / state

సింగరేణిలో ప్రాణాలకు విలువేది? - సింగరేణి ఉద్యోగులు మృతి

సింగరేణిలో పనిచేసే పొరుగుసేవల ఉద్యోగి చనిపోతే పరిహారం అరకొరగానే అందుతోంది. గుత్తేదారులు తమ దయాదాక్షిణ్యాల ఆధారంగా ప్రాణానికి విలువ కట్టి బేరమాడి పరిహారం ఇస్తున్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పరిహారం ఇవ్వాలని కార్మికసంఘాలు డిమాండు చేస్తున్నాయి.

Singareni
Singareni
author img

By

Published : Jun 3, 2020, 6:54 AM IST

బొగ్గు గనుల్లో పనిచేసే కాంట్రాక్టు లేదా పొరుగుసేవల ఉద్యోగుల ప్రాణాలకు విలువలేకుండాపోతోంది. వారిలో ఎవరైనా చనిపోతే కుటుంబానికి తక్షణ సాయం ఎంతివ్వాలనేదానిపై స్పష్టత కరవైంది. గుత్తేదారులు తమ దయాదాక్షిణ్యాల ఆధారంగా ప్రాణానికి విలువ కట్టి బేరమాడి పరిహారం ఇస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత పరిహారం ఇవ్వాలనేది ఒప్పంద పత్రంలోనే రాసి ఉంటే గుత్తేదారులు తప్పించుకునేందుకు అవకాశముండదు. కానీ కాంట్రాక్టు కంపెనీలు నిబంధనలు పాటించకపోవడంతో బాధిత కుటుంబాలు నష్టపోతున్నాయి.

సమానంగా ఇవ్వాలి

మంగళవారం రామగుండం వద్ద పేలుడులో నలుగురు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, శాశ్వత ఉద్యోగులతో సమానంగా పరిహారం ఇవ్వాలని కార్మికసంఘాలు డిమాండు చేస్తున్నాయి. పొరుగుసేవల ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ కల్పించే విషయంలో సింగరేణి సంస్థ నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని సంఘాలు మండిపడుతున్నాయి. పేలుళ్లు, గనుల తవ్వకాలు జరిగే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం, అనుభవం లేని కార్మికులతో పనులు చేయించడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.

లెక్కలు లేవు

గత నాలుగేళ్ల (2017-20)లో గనుల్లో జరిగిన వివిధ ప్రమాదాల వల్ల 30 మంది ప్రాణాలు పోగా, మరో 1,542 మంది శాశ్వత ఉద్యోగులు గాయపడ్డారు. ఇక గుత్తేదారుల వద్ద పనిచేసే పొరుగుసేవల కార్మికుల ప్రాణాలెన్ని పోయాయనే లెక్కలు కానీ, వారికెంత పరిహారం ఇచ్చారనే వివరాలు కానీ ఎక్కడా లేవు. గత నెలరోజుల్లోనే ఐదుగురు పొరుగుసేవల కార్మికులు చనిపోయారు.

రూ.12 లక్షల వరకు చెల్లించాలి

కాంట్రాక్టరు వద్ద పనిచేసే కార్మికులు ప్రమాదంలో చనిపోతే చట్ట ప్రకారం అతడి వేతనంలో 40 శాతాన్ని రిటైర్‌మెంట్‌ వయసు వరకూ లెక్కించి ఇవ్వాలని సింగరేణి సంస్థ సంచాలకుడు భాస్కర్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు. ఇది కాకుండా గనుల భద్రతా చట్టం ప్రకారం మరికొంత పరిహారం ఇవ్వాలన్నారు. ఈ రెండూ కలిపి కనీసం రూ.12 లక్షలకు తగ్గకుండా చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రైవేటు వారితో పనులు చేయించడం అక్రమం

"చట్ట ప్రకారం గనుల్లో పనులన్నీ సింగరేణి సంస్థ శాశ్వత ఉద్యోగులే చేయాలి. ప్రైవేటుగా గుత్తేదారులకిచ్చి పనులు చేయించడం చట్ట విరుద్ధం. దీనివల్ల ఎవరి ప్రాణాలైనా పోతే పూర్తి పరిహారం ఇవ్వకుండా సింగరేణి తప్పించుకుని గుత్తేదారులపైకి నెట్టేస్తోంది. కోల్‌ ఇండియాలో పొరుగుసేవల కార్మికుడు చనిపోతే రూ.15 లక్షల పరిహారం ఇస్తున్నారు. ఇక్కడా అంతే ఇవ్వాలి."

- రియాజ్ అహ్మద్, సింగరేణి మైనర్లు, ఇంజినీర్ల సంఘం హెచ్​ఎంఎస్ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: సింగరేణిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.