హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ రామకృష్ణ కుటుంబంతో కలిసి మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద వీరి కారు కల్వర్టును ఢీకొని... కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. డీసీపీ రవీందర్, ఏసీపీ హబీబ్‌ఖాన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇవీ చూడండి: భవనం కూల్చుతుండగా ప్రమాదం... వ్యక్తి దుర్మరణం