కరోనా విజృంభణ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన దస్తావేజు లేఖరులు సోమవారం నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్‌కు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు తమ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం రోజున సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కేవలం వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రమే కొనసాగడం వల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణ ప్రజలు లేక బోసిపోయింది.