పెద్దపల్లి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ప్రతి విద్యార్థికి శానిటైజర్‌తో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. తరగతిగదిలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
తల్లిదండ్రుల అంగీకారం తీసుకున్న విద్యార్థులనే పాఠశాలలోనికి అనుమతించారు. మొదటి రోజు కావడం వల్ల ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత బడికి వచ్చిన విద్యార్థులు తమ స్నేహితులను కలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 'నేను ఆరోగ్యంగా ఉన్నా.. అలాంటి వార్తలు మానుకోండి'