పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వెలసిన అతి ప్రాచీనమైన అష్టభుజ శ్రీ మహా గణాధిపతి దేవాలయంలో సంకట చతుర్థిని పురస్కరించుకుని భక్తులు విశేషమైన పూజలను నిర్వహించుకుంటున్నారు. ఉదయమే అర్చకులు స్వామివారికి పవిత్రమైన గోదావరి జలాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి సింధూరంతో అలంకరించారు. అనంతరం సహస్ర నామార్చనలతో స్వామివారికి పూజలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
కరోనా సందర్భంగా భక్తులు స్వీయరక్షణ పాటిస్తూ ఒక్కొక్కరుగా దేవాలయాలకు విచ్చేసి మహా గణాధిపతికి విశేష పూజలు నిర్వహించుకుంటున్నారు. స్వామివారికి పసుపు, కుంకుమలు, వస్త్రాలు, గరక, అరటిపండ్లు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్లు, మోదుకలు మొదలగు పూజా ద్రవ్యాలను స్వామివారికి నివేదించి, అర్చనలు, అభిషేకాలను చేయించుకుంటున్నారు.
ప్రత్యేకంగా 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. మహిళా భక్తులు దేవాలయ ప్రాంగణములో పిండితో ప్రత్యేకంగా దీపాలను వెలిగించి వారి భక్తిని చాటుకున్నారు. అర్చకులు స్వామివారికి మంగళ హారతి నివేదించి భక్తులకు తీర్ధ ప్రసాదాలను వితరణ చేస్తున్నారు.
ఇవీ చూడండి: జగ్గీ వాసుదేవ్‌కు దత్తాత్రేయ జన్మదిన శుభాకాంక్షలు