ETV Bharat / state

ఆ వార్తలు అబద్ధం.. డ్రైవర్ ఆత్మహత్యపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ - ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Sajjanar on RTC Driver Suicide: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోడ్రైవర్ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. డ్రైవర్ రాజయ్య స్వీయ అభ్యర్థన మేరకే మూడు నెలల క్రితం జేబీఎస్​కు బదిలీ చేశామని తెలిపారు. ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఏకపక్ష వార్తలు ప్రచురించడం సరికాదని సజ్జనార్‌ పేర్కొన్నారు. ఆత్మహత్యపై విచారణ జరిపి వాస్తవాలు తెలియజేయాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

Sajjanar
Sajjanar
author img

By

Published : Nov 27, 2022, 3:58 PM IST

Sajjanar on RTC Driver Suicide: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్‌ ఆత్మహత్యపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. డ్రైవర్ రాజయ్య ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తమని స్పష్టం చేశారు. రాజయ్య స్వీయ అభ్యర్థన మేరకే మూడునెలల క్రితం జేబీఎస్​కు బదిలీ చేశామని తెలిపారు. జేబీఎస్​లో డ్యూటీ మార్చాలని ఎప్పుడు అధికారులను కోరలేదని స్పష్టం చేశారు.

వ్యక్తిగత కారణాలతోనే గోదావరిఖనిలోని తన ఇంట్లో డ్రైవర్‌ రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని సజ్జనార్ పేర్కొన్నారు. అయినా ఆయన అంత్యక్రియల కోసం సంస్థ తరపున ఇరవై వేల రూపాయలు గోదావరిఖని డిపో మేనేజర్ స్వయంగా వెళ్లి అందజేసినట్లు వెల్లడించారు. రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు కారణమని కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని వివరించారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి సంస్థ నిబద్ధతతో ఉందని తెలిపారు. ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఏకపక్ష వార్తలు ప్రచురించడం సరికాదని సజ్జనార్‌ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపి వాస్తవాలను తెలియజేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.