ఆర్టీసీ కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది. పెద్దపెల్లి జిల్లా మంథనిలో కార్మికులు బస్‌డిపో ముందు మానవహారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరికి, తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తండ్రి పాత్ర పోషించాల్సిన ముఖ్యమంత్రి తమను రోడ్డు మీద పడేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : మిషిన్లతో, డబ్బుతో రక్తం తయారు కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి