పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ రీజినల్ మేనేజర్ జీవన్ ప్రసాద్‌తోపాటు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ రాంరెడ్డి పాల్గొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని జీవన్ ప్రసాద్ సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.
అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. అనేక మంది కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను ప్రమాద రహిత డిపోలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రమాద రహిత డ్రైవర్లగా ఎంపికైన గోదావరిఖని డిపోకు చెందిన ఎం. సత్తయ్య, ఎం. రాజేశం, సమ్మయ్యలను శాలువాతో సత్కరించి.. నగదు అందజేశారు.
ఇవీ చూడండి: కుమారుడు ప్రేమించాడు.. తండ్రి తాళి కట్టాడు..